సీఎంవో నుంచి నాకు ఎలాంటి సమాచారం లేదు: దేవులపల్లి ప్రభాకర్‌రావు

తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) నుంచి తనను ఎవరూ సంప్రదించలేదని దేవులపల్లి ప్రభాకర్‌రావు తెలిపారు.

Updated : 08 Dec 2023 15:30 IST

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) నుంచి తనను ఎవరూ సంప్రదించలేదని దేవులపల్లి ప్రభాకర్‌రావు తెలిపారు. ఇటీవల ఆయన ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. విద్యుత్‌శాఖపై సమీక్షకు పూర్తి వివరాలతో సిద్ధం కావాలని సీఎం రేవంత్‌రెడ్డి గురువారం అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రభాకర్‌రావు రాజీనామాను ఆమోదించవద్దని.. సమీక్ష సమావేశానికి ఆయనను కూడా పిలవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ప్రభాకర్‌రావు స్పందిస్తూ సీఎంవో నుంచి తనకు ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. ‘‘ముఖ్యమంత్రి పిలిస్తే ఎందుకు వెళ్లను?నన్ను పిలిస్తే కచ్చితంగా సమావేశానికి హాజరవుతా’’ అని ప్రభాకర్‌రావు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని