సిట్‌ నివేదికపై ఈసీ ఆదేశాలు వస్తే ఏం చేద్దాం?.. సీఎస్‌తో డీజీపీ భేటీ

రాష్ట్రంలో ఎన్నికల రోజు, అనంతరం జరిగిన హింసపై సిట్‌ నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిన నేపథ్యంలో సీఎస్‌ జవహర్‌రెడ్డితో డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా భేటీ అయ్యారు.

Published : 21 May 2024 15:52 IST

అమరావతి: రాష్ట్రంలో ఎన్నికల రోజు, అనంతరం జరిగిన హింసపై సిట్‌ నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిన నేపథ్యంలో సీఎస్‌ జవహర్‌రెడ్డితో డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా భేటీ అయ్యారు. మంగళవారం సచివాలయంలో ఇద్దరు ఉన్నతాధికారులు చర్చలు జరిపారు. సిట్‌ ప్రాథమిక నివేదికపై ఈసీ నుంచి తదుపరి ఆదేశాలు వస్తే తీసుకోవాల్సి చర్యలపై ఇరువురు చర్చించినట్టు సమాచారం.

ఎన్నికల సంఘం ఆదేశాలమేరకు ఏర్పాటైన సిట్‌ దర్యాప్తులో పోలీసుల వైఫల్యాలు వెలుగుచూశాయి. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో రెండు రోజులుగా విస్తృతంగా పర్యటించిన సిట్‌ బృందాలు 6 నియోజకవర్గాల పరిధిలో తీవ్ర హింసాత్మక ఘటనలకు సంబంధించి నమోదైన 33 కేసులను పరిశీలించాయి. వీటికి సంబంధించిన 150 పేజీల సమగ్ర నివేదికను సిట్‌ అధిపతి వినీత్‌ బ్రిజ్‌లాల్, ఎస్పీ రమాదేవి సోమవారం సాయంత్రం డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తాకు అందజేశారు. ఆయన ఈ నివేదికను ఎన్నికల సంఘానికి పంపించిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో సిట్‌ నివేదిక కలకలం రేపుతోంది. ఈసీ నుంచి ఎలాంటి ఆదేశాలు వస్తాయోనని పోలీసుశాఖలో తీవ్ర చర్చ జరుగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని