AP DGP: వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్టు అంశంపై సీఈఓకు డీజీపీ నివేదిక

మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు అంశంపై రాష్ట్రఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) ముకేశ్‌ కుమార్‌మీనాకు డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా నివేదిక అందజేశారు.

Published : 22 May 2024 22:30 IST

అమరావతి: మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు అంశంపై రాష్ట్రఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) ముకేశ్‌ కుమార్‌మీనాకు డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా నివేదిక అందజేశారు. రెంటచింతల మండలం పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రంలో ఎమ్మెల్యే తన అనుచరులతో కలిసి వెళ్లి ఈవీఎంను ధ్వంసం చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి మే 15న పిన్నెల్లిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మే 20న ఆయనను మొదటి నిందితుడిగా పేర్కొంటూ ఎఫ్‌ఐఆర్‌లో మార్పులు చేసినట్లు వివరించారు. పిన్నెల్లిని అరెస్టు చేసేందుకు 8 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు. వీలైనంత త్వరగా ఎమ్మెల్యేను అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని నివేదికలో వెల్లడించారు. ఈవీఎం ధ్వంసంపై సిట్‌ రిపోర్టును కూడా ఈ నివేదికకు జత చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు