Chada Venkat Reddy: సర్వే నెంబర్ల వారీగా భూముల డిజిటల్‌ సర్వే చేపట్టాలి: సీపీఐ నేత చాడ

సర్వే నెంబర్ల వారీగా భూముల డిజిటల్‌ సర్వే చేపట్టాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి (Chada venkat Reddy) అన్నారు.

Published : 19 Dec 2023 19:31 IST

హైదరాబాద్‌: సర్వే నెంబర్ల వారీగా భూముల డిజిటల్‌ సర్వే చేపట్టాలని, ధరణి పోర్టల్‌లోని లొసుగులను తక్షణమే పరిష్కరించేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి (Chada venkat Reddy) కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి ఆయన లేఖ రాశారు. తెలంగాణలో 90 సంవత్సరాల క్రితం భూసర్వే జరిగిందని, ప్రస్తుతం చాలా చోట్ల సర్వే నెంబర్ల హద్దు రాళ్ళు లేనందువల్ల భూ వివాదాలు పెరిగి పోతున్నాయని లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్‌బోర్డు, భూదాన యజ్ఞ భూములు కూడా అన్యాక్రాంత మవుతున్నాయని తెలిపారు. భూ వివాదాల కారణంగా పేద, మధ్య తరగతి ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని