Passport: విజయవాడలో పాస్‌పోర్టు సేవలకు అంతరాయం

విజయవాడలోని పాస్‌పోర్టు సేవా కేంద్రంలో సేవలకు అంతరాయం కలిగింది.

Published : 21 Mar 2024 15:53 IST

విజయవాడ: నగరంలోని పాస్‌పోర్టు సేవా కేంద్రంలో సేవలకు అంతరాయం కలిగింది. సుమారు గంటన్నరపాటు సేవలు నిలిచిపోయాయి. సాంకేతిక కారణాలతో సర్వర్‌ పనిచేయలేదని అధికారులు చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా పలు చోట్ల సాంకేతిక సమస్య తలెత్తినట్టు తెలిపారు. విజయవాడ పాస్‌పోర్టు కేంద్రంలో రోజుకు 550 నుంచి 600 స్లాట్లు ఇస్తున్నారు. సాంకేతికలోపం కారణంగా పలువురు అభ్యర్థులు ఇబ్బందులు పడ్డారు. సాధ్యమైనంత వరకు ఈరోజు స్లాట్లు పూర్తి చేస్తామని పాస్‌పోర్టు ప్రాంతీయ అధికారి తెలిపారు. మిగిలిన వారికి మరో రోజు స్లాట్లు ఇస్తామని, అభ్యర్థులు ఆందోళన చెందవద్దని హామీ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని