జూన్‌ 8, 9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ: బత్తిని కుటుంబ సభ్యులు

చేప ప్రసాదం పంపిణీ జూన్‌ 8 ఉదయం 11 నుంచి జూన్‌ 9 ఉదయం 11 గంటల వరకు ఉంటుందని బత్తిని కుటుంబ సభ్యులు తెలిపారు.

Updated : 20 May 2024 14:02 IST

హైదరాబాద్‌: చేప ప్రసాదం పంపిణీ జూన్‌ 8 ఉదయం 11 నుంచి జూన్‌ 9 ఉదయం 11 గంటల వరకు ఉంటుందని బత్తిని కుటుంబ సభ్యులు తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో పంపిణీ ఉంటుందని తెలిపారు. చేప ప్రసాదం కోసం వచ్చేవారికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఆస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు వంటి శ్వాస సంబంధ వ్యాధుల నివారణకు ఏటా దీన్ని పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఇక్కడి చేప ప్రసాదం తింటే ఆరోగ్యానికి మంచిదని పలువురి నమ్మకం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని