andhra pradesh elections: సీసాల్లో పెట్రోలు, డీజిల్‌ నింపొద్దు: ఈసీ

ఏపీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని పెట్రోలు బంకుల నిర్వాహకులకు ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది.

Published : 18 May 2024 17:44 IST

అమరావతి: ఏపీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని పెట్రోలు బంకుల నిర్వాహకులకు ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. సాధారణ ఎన్నికల నియామవళి ప్రకారం కంటెయినర్లు, సీసాల్లో పెట్రోలు, డీజిల్‌ నింపవద్దని సూచించింది. ఓట్ల లెక్కింపు తదుపరి చర్యలు పూర్తయ్యే వరకు వాహనాలకు మాత్రమే ఇంధనం నింపాలని ఆదేశించింది. పౌరసరఫరాలశాఖ ద్వారా రాష్ట్రంలోని పెట్రోల్‌, డీజిల్‌ బంకు యజమానులకు నోటీసులు అందాయి. అందులోని నిబంధనలు ఉల్లంఘిస్తే బంకు లైసెన్సు రద్దు చేస్తామని హెచ్చరించింది. ఈసీ, పౌరసరఫరాలశాఖ ఆదేశాలను యజమానులందరూ తప్పనిసరిగా పాటించాలని డీలర్ల సమాఖ్య అధ్యక్షులు రావి గోపాలకృష్ణ కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు