Election commission: ఏపీలో కౌంటింగ్‌ రోజు ఎలాంటి హింసకు తావివ్వొద్దు: కేంద్ర ఎన్నికల సంఘం

ఏపీలో ఓట్ల లెక్కింపును ఎలాంటి హింసాత్మక ఘటనలకూ తావులేకుండా నిర్వహించే అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది.

Published : 29 May 2024 18:42 IST

అమరావతి: ఏపీలో ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి హింసాత్మక ఘటనలకూ తావులేకుండా చూడాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియపై దిల్లీ నుంచి ఈసీ ఉన్నతాధికారులు పలుమార్లు సమీక్షలు నిర్వహిస్తున్నారు. సీఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టేలా కేంద్ర ఎన్నికల కమిషన్‌లోని సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ సమీక్ష చేపట్టారు. త్వరితగతిన కచ్చితమైన ఫలితాల ప్రకటనకు, శాంతి భద్రతల పరిరక్షణకు నియోజకవర్గాల వారీగా ఇప్పటి వరకూ చేసిన ఏర్పాట్లపై దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆయన ఆరా తీశారు. 

ఈ సమావేశానికి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్‌ కుమార్ మీనా, రాష్ట్ర పోలీసు నోడల్ అధికారి ఏడీజీ శంకబ్రత బాగ్చి సహా అన్ని నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలు హాజరయ్యారు. కౌంటింగ్ కేంద్రాల వద్దకు ఇతరులను అనుమతించొద్దని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు స్పష్టం చేశారు. క్రౌడ్ మేనేజ్‌మెంట్‌ సిస్టం, భద్రతా వ్యవస్థలో లోపాలు లేకుండా చూసుకోవాలని తేల్చి చెప్పారు. ఎలాంటి హింసాత్మక ఘటనలూ జరిగేందుకు వీల్లేదని ఎస్పీలను ఆదేశించారు. ప్రత్యేకించి పల్నాడు సహా రాయలసీమ జిల్లాల్లోని కొన్ని చోట్ల ఎన్నికల అనంతరం హింస చెలరేగిన నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు