Telangana: ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ విడుదలకు ఈసీ అనుమతి

తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ విడుదలకు ఎన్నికల సంఘం అనుమతిచ్చింది.

Updated : 02 Dec 2023 18:15 IST

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ విడుదలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) అనుమతి ఇచ్చింది. ఉద్యోగులకు మూడు డీఏలు పెండింగ్‌లో ఉండగా.. ఒక డీఏ విడుదలకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఈసీని విజ్ఞప్తి చేసింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, ఈసీ మధ్య సంప్రదింపులు జరిగాయి. డీఏల చెల్లింపు ఎందుకు ఆలస్యం అయిందని.. ఇప్పుడే ఎందుకు ఇస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈసీ అడిగింది. గతంలో డీఏల చెల్లింపు విధానాలపైనా ఈసీ ఆరా తీసింది. డీఏ విడుదలకు అనుమతి ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు కూడా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వారా ఈసీకి తమ వినతిని పంపాయి. తాజాగా పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఉద్యోగులకు డీఏ విడుదలకు ఈసీ అనుమతి ఇచ్చింది. ఒక డీఏ విడుదలకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని