Andhra news: ఎన్నికల్లో పోటీకి అనర్హుల జాబితాను ప్రకటించిన ఈసీ

రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల్లో పోటీకి అనర్హుల జాబితాను ఎన్నికల సంఘం రిటర్నింగ్‌ అధికారులకు పంపింది.

Published : 23 Mar 2024 22:34 IST

అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల్లో పోటీకి అనర్హుల జాబితాను ఎన్నికల సంఘం రిటర్నింగ్‌ అధికారులకు పంపింది. ఏపీలోని వేర్వేరు నియోజకవర్గాల్లో 51 మంది ఎన్నికల్లో పోటీకి అనర్హులని ఈసీ పేర్కొంది.  ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్‌ 10ఏ ప్రకారం జాబితాలోని 51 మంది ఎన్నికల్ల్లో పోటీకి అనర్హులని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జాబితాను ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లోనూ అందుబాటులో ఉంచినట్టు ఈసీ స్పష్టం చేసింది. ఈ జాబితాను రిటర్నింగ్‌ అధికారులు అందుబాటులో ఉంచుకోవాలని ఈసీ ఉత్తర్వుల్లో పేర్కొంది. కొన్ని నియోజకవర్గాల్లో ఒకే పేరు ఉన్న వ్యక్తులను అనర్హులుగా ఈసీ ప్రకటించింది. గుడివాడ నియోజకవర్గంలో కొడాలి వెంకటేశ్వరరావు అనే వ్యక్తిని అనర్హుల జాబితాలో ఈసీ పేర్కొంది. 2024 మార్చి 15 నాటికి ఉన్న అనర్హుల జాబితాను అందుబాటులో ఉంచినట్టు స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని