EC: ప్రధాని సభలో భద్రతా వైఫల్యం.. నివేదిక కోరిన ఈసీ

ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొన్న సభలో భద్రతా వైఫల్యంపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్‌ అయింది.

Published : 21 Mar 2024 20:02 IST

దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొన్న సభలో భద్రతా వైఫల్యంపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్‌ అయింది. దీనిపై నివేదిక ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్‌ మీనాను కోరింది. త్వరగా విచారణ పూర్తిచేసి నివేదిక ఇవ్వాలని  ఆదేశాలు జారీ చేసింది.

ఏం జరిగిందంటే?

మార్చి 17న చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడిలో భాజపా, తెదేపా, జనసేన కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ప్రజాగళం’ సభలో ప్రధాని మోదీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సభలో పోలీసుల వైఫల్యం అడుగడుగునా కనిపించింది. పల్నాడు ఎస్పీ రవిశంకర్‌రెడ్డి తన యంత్రాంగంతో బందోబస్తు విధులు సమర్థంగా చేయించటంలో విఫలమయ్యారని విపక్షాలు ఆరోపించాయి. ప్రధాని సభలో జరిగిన తొక్కిసలాట, రభసే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నాయి. ప్రధాన వేదికకు సమీపంలో ఉన్న గ్యాలరీలోనే నీళ్ల సీసా విసరడం, వేదిక ముందు తోపులాట చోటుచేసుకున్నా పట్టించుకోలేదు. వీవీఐపీ, మీడియా గ్యాలరీల్లోకి కార్యకర్తలు చొచ్చుకువచ్చి తోపులాటకు దిగినా పోలీసులు ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యారు. పోలీసుల వైఫల్యంపై ఫిర్యాదులు అందడంతో కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు