AP Elections: ఇంటింటి ప్రచారానికీ అనుమతి తీసుకోవాల్సిందే: ఈసీ

సభలు, సమావేశాలు, ఎన్నికల ప్రచార కార్యక్రమాల అనుమతులకు రాజకీయ పార్టీలు సువిధ పోర్టల్‌ వినియోగించాలని సీఈవో ముకేశ్‌కుమార్‌ మీనా సూచించారు.

Updated : 26 Mar 2024 19:39 IST

అమరావతి: సభలు, సమావేశాలు, ఎన్నికల ప్రచార కార్యక్రమాల అనుమతులకు రాజకీయ పార్టీలు సువిధ పోర్టల్‌ suvidha.eci.gov.in వినియోగించాలని సీఈవో ముకేశ్‌కుమార్‌ మీనా సూచించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో సచివాలయంలోని ఈసీ కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. వైకాపా, తెదేపా, భాజపా, కాంగ్రెస్‌, వామపక్ష పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. ఇంటింటి ప్రచారానికి, సభలు, ర్యాలీల నిర్వహణకు అనుమతి తీసుకోవాల్సిందేనని సీఈవో స్పష్టం చేశారు.

సభలు, ర్యాలీలు, ప్రచారంపై 48 గంటల ముందుగానే సువిధ యాప్, పోర్టల్ నుంచి సంబంధిత రిటర్నింగ్ అధికారికి దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసిన 24 గంటల్లోగా ప్రచారానికి సంబంధించిన అన్ని అనుమతులు జారీ అవుతాయని స్పష్టం చేశారు. ఆన్ లైన్ నామినేషన్లు, అఫిడవిట్ దాఖలు, సభలు, సమావేశాలు, ర్యాలీలు, ప్రచార కార్యక్రమాల కోసమే సువిధా పోర్టల్ రూపకల్పన చేసినట్టు వివరించారు. ఎన్నికల కోడ్ దృష్ట్యా రాజకీయ పార్టీలు, అభ్యర్ధులు అనుసరించాల్సిన విధివిధానాలు, తీసుకోవాల్సిన అనుమతులపై అవగాహన ఉండాలని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని