Badrachalam: భద్రాద్రి రామయ్య కల్యాణం ప్రత్యక్ష ప్రసారానికి ఈసీ అనుమతి

భద్రాచలం శ్రీసీతారాముల కల్యాణం ప్రసార మాధ్యమాల్లో ప్రత్యక్ష ప్రసారానికి ఎన్నికల సంఘం అనుమతిచ్చింది. 

Updated : 16 Apr 2024 21:10 IST

హైదరాబాద్‌: భద్రాచలం శ్రీసీతారాముల కల్యాణం ప్రత్యక్ష ప్రసారానికి ఎన్నికల సంఘం అనుమతిచ్చింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాములోరి కల్యాణం ప్రత్యక్ష ప్రసారం చేయకూడదని ఏప్రిల్‌ 4న ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. గత 40 ఏళ్లుగా లైవ్‌ టెలికాస్ట్‌ చేస్తున్నామని, ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరుతూ తెలంగాణ దేవాదాయశాఖ ఈసీకి లేఖ రాసింది. ఈసీ నిర్ణయంపై రాజకీయ పార్టీలు కూడా అభ్యంతరం తెలిపాయి. దీంతో స్పందించిన ఎన్నికల సంఘం .. రేపటి కల్యాణ మహోత్సవాన్ని లైవ్‌ ప్రసారం చేసేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని