EC: తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు ఈసీ అనుమతి

తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిచ్చింది.

Published : 24 May 2024 17:20 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిచ్చింది. జూన్‌ 2న సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదే రోజు గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద  సీఎం రేవంత్‌రెడ్డి నివాళులర్పించనున్నారు. ఈసీ నుంచి అనుమతి లభించిన నేపథ్యంలో వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు చేయలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వివిధశాఖల అధికారులను ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని