Andhra News: సలహాదారులకు ఎన్నికల కోడ్‌ వర్తిస్తుంది.. గీత దాటితే వేటే: ఈసీ

ప్రభుత్వ సలహాదారులకు ఎన్నికల కోడ్‌ వర్తిస్తుందని ఈసీ స్పష్టం చేసింది.

Published : 16 Apr 2024 22:10 IST

అమరావతి: ప్రభుత్వ సలహాదారులకు ఎన్నికల కోడ్‌ వర్తిస్తుందని ఈసీ స్పష్టం చేసింది. ప్రభుత్వ జీతభత్యాలు పొందుతోన్న 40 మందికి కోడ్‌ వర్తిస్తుందని తెలిపింది. ఈమేరకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. నిర్దేశించిన విధులకు బదులుగా రాజకీయ జోక్యం చేసుకుంటున్నట్టు ప్రభుత్వ సలహాదారులపై ఈసీకి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.  ప్రతిపక్షాలను విమర్శిస్తూ మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నట్టు ఈసీ గుర్తించింది. కోడ్‌ ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని