EC: తిరుపతి ఉపఎన్నికలో దొంగ ఓట్లు.. మరో అధికారిపై వేటు

తిరుపతి ఉప ఎన్నిక దొంగ ఓట్ల ఘటనలో మరో అధికారిపై వేటు పడింది.

Published : 09 Feb 2024 19:56 IST

అమరావతి: తిరుపతి ఉప ఎన్నిక దొంగ ఓట్ల ఘటనలో మరో అధికారిపై వేటు పడింది. ఎన్నికల సంఘం ఆదేశాలతో ప్రస్తుతం విజయవాడ మెప్మా అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఉన్న చంద్రమౌళీశ్వర్‌రెడ్డిని సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

తిరుపతి ఉప ఎన్నిక సమయంలో నగరపాలక సంస్థ సహాయ కమిషనర్‌గా పనిచేసిన చంద్రమౌళి ఆ తరువాత విజయవాడ మెప్మా అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఆర్‌వో లాగిన్‌తో 35వేల ఓటరు కార్డులు డౌన్‌లోడ్‌ చేశారని ఆరోపణలు వచ్చాయి. దొంగ  ఓట్ల వ్యవహారంలో ఇప్పటికే అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ గిరీషా సస్పెండ్‌ అయిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు