MLC Kavitha: ఈడీ కేంద్ర కార్యాలయానికి ఎమ్మెల్సీ కవిత

దిల్లీ లిక్కర్‌ కేసులో అరెస్టు చేసిన భారాస ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు దిల్లీకి తరలించారు.

Updated : 16 Mar 2024 01:10 IST

హైదరాబాద్‌: దిల్లీ లిక్కర్‌ కేసులో అరెస్టు అయిన భారాస ఎమ్మెల్సీ కవితను అధికారులు ఈడీ కేంద్ర కార్యాలయానికి తరలించారు. తొలుత భారీ భద్రత మధ్య బంజారాహిల్స్‌లోని ఆమె నివాసం నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి 8.45 గంటలకు విమానంలో దిల్లీ తరలించారు. రాత్రి 11.30 గంటల తర్వాత దిల్లీ విమానాశ్రయం నుంచి నేరుగా ఈడీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. రాత్రి అక్కడే ఉంచనున్నారు. ఇప్పటికే ఈడీ కార్యాలయానికి వెళ్లే మార్గాలను మూసివేసి పరిసర ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్‌ విధించారు. కవిత తరఫు న్యాయవాది మొహిత్‌ రావు సైతం ఈడీ కార్యాలయానికి వెళ్లారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని