MLC Kavitha: కవిత ఆడపడుచు ఇంట్లో ముగిసిన ఈడీ సోదాలు

ఎమ్మెల్సీ కవిత బంధువుల నివాసాల్లోనూ ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. కవిత భర్త అనిల్‌ బంధువుల ఇళ్లలో శనివారం ఉదయం నుంచి సోదాలు చేపట్టారు.

Updated : 23 Mar 2024 18:22 IST

హైదరాబాద్‌: దిల్లీ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ కవిత బంధువుల నివాసాల్లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. మాదాపూర్‌లోని కవిత ఆడపడుచు అఖిల ఇంట్లో శనివారం ఉదయం నుంచి దాదాపు 11 గంటలపాటు సుదీర్ఘ సోదాలు నిర్వహించారు. కవిత అల్లుడు శరణ్‌ పాత్రపై ఆరా తీశారు. అఖిల.. కవిత భర్త అనిల్‌ సోదరి.

మరోవైపు వారం రోజుల కస్టడీ ముగియడంతో ఎమ్మెల్సీ కవితను రౌజ్‌ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టులో ఈడీ హాజరుపరిచింది. ఆమెను మరో 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని దర్యాప్తు అధికారులు కోర్టును కోరారు. కేసు దర్యాప్తు పురోగతిని ఈడీ న్యాయవాది కోర్టుకు వివరించారు. మరికొందరితో కలిపి ఆమెను ప్రశ్నించాల్సి ఉందని పేర్కొన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు కవిత కస్టడీని మరో మూడు రోజులు పొడిగిస్తూ తీర్పు వెలువరించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని