MLC Kavitha: ఆప్‌ నేతలతో కలిసి ఎమ్మెల్సీ కవిత అక్రమాలు.. ఈడీ ప్రకటన

భారాస ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌(ఈడీ) ప్రకటన విడుదల చేసింది.

Updated : 18 Mar 2024 18:53 IST

దిల్లీ: భారాస ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అరెస్టుపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌(ED) ప్రకటన విడుదల చేసింది. దిల్లీ మద్యం పాలసీ కుంభకోణం (delhi liquor scam) కేసులో ఈ నెల 15న ఆమెను అరెస్టు చేసినట్లు పేర్కొంది. దిల్లీలోని రౌస్‌ అవెన్యూ ప్రత్యేక కోర్టు 7 రోజుల కస్టడీకి అనుమతించగా.. ఈ నెల 23వ తేదీ వరకు కస్టడీకి తీసుకున్నట్లు ఈడీ తెలిపింది.

‘‘ఈ నెల 15న కవిత ఇంట్లో సోదాలు నిర్వహించాం. ఆ సమయంలో ఆమె బంధువులు, అనుచరులు మా విధులకు ఆటంకం కలిగించారు. ఆప్‌ నేతలతో కలిసి కవిత అక్రమాలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. దిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌, మనీష్ సిసోడియాతో కలిసి కుట్ర పన్నారు. 2021-22 ఏడాదిలో మద్యం కుంభకోణానికి పాల్పడ్డారు. మద్యం పాలసీని నిబంధనలకు విరుద్ధంగా రూపొందించారు. హోల్‌సేల్‌ డీలర్ల నుంచి వచ్చిన డబ్బును వాటాలుగా పంచుకున్నారు. ఆమ్‌ ఆద్మీ పార్టీకి కవిత రూ.100 కోట్లు చెల్లించారు. ఈ కేసులో ఇప్పటివరకు హైదరాబాద్‌, చెన్నై, ముంబయి సహా 245 ప్రాంతాల్లో సోదాలు చేశాం. మనీష్ సిసోడియా, సంజయ్‌ సింగ్‌, విజయ్‌ నాయర్‌తోపాటు మొత్తం 15 మందిని అరెస్టు చేశాం. రూ. 128.79 కోట్ల నగదు సీజ్ చేశాం’’ అని  పేర్కొంది. కేసులో ఒక నేరాభియోగపత్రం, 5 అనుబంధ పత్రాలు దాఖలు చేసినట్లు తెలిపిన ఈడీ.. ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని