Election Commission: ఆర్వో సీల్ లేకున్నా పోస్టల్‌ బ్యాలట్లు తిరస్కరించవద్దు: ఈసీ

రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో) సీల్‌ లేకున్నా పోస్టల్‌ బ్యాలట్లను తిరస్కరించవద్దని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) స్పష్టం చేసింది.

Updated : 26 May 2024 12:56 IST

అమరావతి: రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో) సీల్‌ లేకున్నా పోస్టల్‌ బ్యాలట్లను తిరస్కరించవద్దని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) స్పష్టం చేసింది. ఈ మేరకు మార్గదర్శకాలను జారీ చేసింది. ఈసీ మార్గదర్శకాలను అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు సీఈవో ముకేశ్‌కుమార్‌ మీనా పంపించారు. 

‘‘ఆర్వో సంతకం ఉన్న పోస్టల్ బ్యాలట్లు చెల్లుబాటు అవుతాయి. ఫామ్‌ 13ఏపై ఆర్వో సంతకంతో పాటు అన్ని వివరాలు ఉండాలి. ఆర్వో సంతకం సహా బ్యాలట్‌ను ధ్రువీకరించే రిజిస్టర్‌తో సరిపోల్చుకోవాలి. ఫామ్‌ 13ఏలో ఓటరు, ఆర్వో సంతకం, బ్యాలట్‌ సీరియల్‌ నంబర్‌ లేకుంటే వాటిని తిరస్కరించవచ్చు’’ అని ఈసీ స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని