Andhra news: ఏపీలో ‘ఈ-ఆఫీస్‌’ అప్‌గ్రేడేషన్‌ ప్రక్రియను వాయిదా వేసిన ఈసీ

ఏపీలో ‘ఈ-ఆఫీస్‌’ అప్‌గ్రేడేషన్‌ ప్రక్రియను వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. 

Updated : 17 May 2024 19:04 IST

అమరావతి: ఏపీలో ‘ఈ-ఆఫీస్‌’ అప్‌గ్రేడేషన్‌ ప్రక్రియను వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. గ్రామ, వార్డు సచివాలయాలకు ‘ఈ-ఆఫీస్‌’ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్‌ను అప్‌గ్రేడ్‌ చేసే పేరుతో వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు.. గవర్నర్‌, ఏపీ సీఈవోకు ఫిర్యాదు చేశారు. దీంతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్‌ కుమార్‌ మీనా ‘ఈ-ఆఫీస్‌’ అప్‌ గ్రేడేషన్‌పై ఎన్‌ఐసీ ప్రతినిధులను పిలిపించి ఆరా తీశారు. అనంతరం  అప్‌గ్రేడేషన్‌ ప్రక్రియను నిలిపివేయాలని ఎన్‌ఐసీని ఎంకే మీనా ఆదేశించారు.

ఈనెల 17 నుంచి 25 వరకు ఈ-ఆఫీస్‌ అప్‌గ్రేడేషన్‌ చేపట్టనున్నట్టు ఇప్పటికే ఎన్‌ఐసీ షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈసీ ఆదేశాల నేపథ్యంలో తదుపరి షెడ్యూల్‌ను తర్వాత విడుదల చేస్తామని ప్రభుత్వ శాఖలకు సమాచారం అందించింది.  ప్రస్తుతం ఉన్న ఈ- ఆఫీస్‌ వెర్షన్‌తోనే విధులు నిర్వహించాలని ప్రభుత్వ విభాగాలను ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని