Andhra News: సీఎం జగన్‌కు ఎన్నికల సంఘం నోటీసులు

సీఎం జగన్‌కు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్‌ కుమార్‌మీనా నోటీసులు జారీ చేశారు.  

Updated : 07 Apr 2024 20:47 IST

అమరావతి: సీఎం జగన్‌కు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్‌ కుమార్‌మీనా నోటీసులు జారీ చేశారు. సీఎం తన ప్రసంగాల్లో చంద్రబాబును పశుపతితో పోల్చారని, ఇంటింటికీ పింఛను అందకుండా చేసి 31 మంది అవ్వాతాతలను చంద్రబాబు చంపారంటూ జగన్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారని వర్ల రామయ్య ఇటీవల సీఈవోకు ఫిర్యాదు చేశారు. అనుచిత వ్యాఖ్యలు కోడ్‌ ఉల్లంఘన కిందకు వస్తాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సీఈవో.. చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు 48 గంటల్లో వివరణ ఇవ్వాలని  జగన్‌కు నోటీసులు ఇచ్చారు. సకాలంలో స్పందించకపోతే ఈసీ చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని