Andhra News: రోడ్డెక్కిన అన్నదాతలు.. పామర్రు-గుడివాడ మార్గంలో ఆందోళన
ధాన్యం కొనుగోలు చేయాలంటూ కృష్ణా జిల్లాలో అన్నదాతలు రోడ్డెక్కారు. పామర్రు-గుడివాడ రోడ్డులో జమిగోల్వేపల్లి వద్ద ఆందోళనకు దిగారు.
పామర్రు: ధాన్యం కొనుగోలు చేయాలంటూ కృష్ణా జిల్లాలో అన్నదాతలు రోడ్డెక్కారు. పామర్రు-గుడివాడ రోడ్డులో జమిగోల్వేపల్లి వద్ద ఆందోళనకు దిగారు. రోడ్డుపై ధాన్యం పోసి అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. రైతుల ఆందోళనతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పెద్ద ఎత్తున వాహనాలు ఆగిపోవడంతో పోలీసులు అక్కడికి చేరుకుని రైతులతో చర్చలు జరుపుతున్నారు.
అప్పులతో వ్యవసాయం చేస్తున్నామని.. వడ్డీలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కోత చేసి పదిరోజులైనా పంట కొనేవాళ్లు లేరని మండిపడ్డారు. దిగుబడికి సరిపడా సంచులను సొసైటీలో ఇవ్వడం లేదని ఆరోపించారు. సమస్యలను పరిష్కరించాల్సిన వ్యవసాయ అధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
WT20 WC 2023: మహిళల టీ20 ప్రపంచకప్.. టీమ్ఇండియా షెడ్యూల్ ఇదే
-
Crime News
Rajasthan: పెట్రోల్ ట్యాంకర్లో మద్యం అక్రమ రవాణా..!
-
World News
Australia: డాల్ఫిన్లతో ఈతకని దిగి.. సొర చేపకు చిక్కి..!
-
Sports News
Gill: ‘శుభ్‌మన్.. నాగ్‌పుర్ ఏదో చెబుతోంది చూడు’’: ఉమేశ్ యాదవ్ ఫన్నీ ట్వీట్
-
World News
Wikipedia: పాక్‌లో వికీపీడియాపై నిషేధం.. స్పందించిన వికీమీడియా
-
General News
Rushikonda: బోడికొండకు కవరింగ్.. జర్మన్ టెక్నాలజీతో జియో మ్యాటింగ్