కోనసీమ జిల్లాలో బోరు నుంచి మంటలు

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో బోరు నుంచి మంటలు వచ్చాయి.

Published : 22 Apr 2024 13:31 IST

మలికిపురం: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో బోరు నుంచి మంటలు వచ్చాయి. మలికిపురం మండలం దిండి కాసవరపు లంకలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంచినీటి బోరు వేస్తుండగా మంటలు ఎగసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు ఘటనాస్థలికి చేరుకున్నారు. గ్యాస్‌ పైపులైన్‌ వల్లే మంటలు వచ్చినట్లు భావిస్తున్నారు. ఓఎన్‌జీసీ సిబ్బందికి అధికారులు సమాచారం ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని