Godavari Flood: గోదావరిలో వరద ఉద్ధృతి.. పాపికొండల విహారయాత్ర రద్దు

భారీ వర్షాలతో గోదావరిలో వరద ఉద్ధృతి పెరుగుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం గండి పోచమ్మ ఆలయం వద్ద నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.

Updated : 20 Jul 2023 13:28 IST

పోలవరం: భారీ వర్షాలతో గోదావరిలో వరద ఉద్ధృతి పెరుగుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం గండి పోచమ్మ ఆలయం వద్ద నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. అమ్మవారి ఆలయ గోపురం వరకు వరదనీరు చేరింది. వరద ప్రభావంతో ఆయా ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఉద్ధృతి నేపథ్యంలో పాపికొండల విహారయాత్రను పర్యాటకశాఖ అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు.

మరోవైపు పోలవరం ప్రాజెక్టు వద్ద నీటిమట్టం 31 మీటర్లకు చేరింది. వరద మరింత పెరిగే అవకాశముందని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. గోదావరి నుంచి గత 48 గంటలల్లో 3.25 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని