Old Age: తాతా బామ్మా..మీరు ఏం తినాలో తెలుసా..? ఈ జాగ్రత్తలు తీసుకోండి..!

ఇపుడు వృద్ధాప్యం అంటే 70 ఏళ్లు దాటినవారే..ఈ విషయాన్ని ఆరోగ్య సంస్థలు కూడా పేర్కొంటున్నాయి. ఈ వయసులో పోషకాహారం తీసుకుంటే పదికాలాల పాటు హాయిగా ఉండొచ్చు..వయసులో ఉన్నట్టుగా వృద్ధాప్యంలో ఏం తిన్నా సరిగా జీర్ణం కాదు. తినాలన్నా కోరిక ఉన్నా తినే ఓపిక ఉండదు. దానికి తోడూ ఆహారం సమతులంగా తీసుకోకపోవడంతో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతాయి.

Published : 05 Oct 2022 01:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇపుడు వృద్ధాప్యం అంటే 70 ఏళ్లు దాటినవారే..ఈ విషయాన్ని ఆరోగ్య సంస్థలు కూడా పేర్కొంటున్నాయి. ఈ వయసులో పోషకాహారం తీసుకుంటే పదికాలాల పాటు హాయిగా ఉండొచ్చు..వయసులో ఉన్నట్టుగా వృద్ధాప్యంలో ఏం తిన్నా సరిగా జీర్ణం కాదు. తినాలన్నా కోరిక ఉన్నా తినే ఓపిక ఉండదు. దానికి తోడూ ఆహారం సమతులంగా తీసుకోకపోవడంతో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతాయి. అనారోగ్యం కూడా ఓ కారణంగా ఉంటోంది.  అందుబాటులో ఉన్న ఆకు, కూరగాయలను పద్ధతిగా తీసుకుంటే జీర్ణ వ్యవస్థకు ఇబ్బందులుండవని పోషకాహార నిపుణురాలు డాక్టర్‌ అంజలీదేవి పలు విషయాలు తెలిపారు.

ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే...

* ఆహారం ఎలా తీసుకోవాలో జాతీయ పోషకాహార నిపుణులు ఒక సూచన చేశారు. రోజులో పళ్లెంలో ఏం ఉండాలో తెలిపారు. సగం ప్లేట్‌లో ఆకుకూరలు, పండ్లు, పచ్చకూరలు, దుంపలు కొంచెం ఉండాలి. పావువంతు గింజ ధాన్యాలు, మరో పావువంతు మాంసకృతులుండాలి.

* ప్రతి రోజూ ఏదో ఒక ఆకుకూర 100 గ్రాములు తినాలి. ఇనుము, కాల్షియం లభిస్తాయి.

* పండ్లలో బి కాంప్లెక్సు ఎక్కువగా ఉంటుంది. ఇది నరాల బలహీనతలను నివారిస్తుంది.

* గింజధాన్యాలు ఎక్కువగా తింటే..దుంపలు తక్కువగా తినాలి. ఈ రెండింటిలో ఇంధనమే ఉంటుంది. వృద్ధాప్యంలో పని చేయలేరు. అందుకే వీళ్లు తక్కువగా తీసుకోవాలి.

* పాలు, పాల పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. రోజూ ఒక గ్లాసు పాలు తాగితే మరీ మంచిది.

* తీపి పదార్థాలు, ఫ్రైలు ఎక్కువగా తినొద్దు. ఫాస్ట్‌ఫుడ్‌ తినడానికి మొగ్గు చూపొద్దు. ఎందుకంటే మధుమేహం, బీపీ ఉంటుంది కదా..!

* వయసుకు తగ్గ వ్యాయామం చేయాలి. కొంచెం కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. రాగి జావ తాగాలి. అవసరమైతే విటమిన్‌ సప్లిమెంట్లను వైద్యుల సలహాతో వేసుకోవాలి. విటమిన్‌ డి వారానికి ఒకటి వేసుకుంటే కాళ్లనొప్పులు తగ్గిపోతాయి. నీటిని ఎక్కువగా తాగాలి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని