Kadapa: యోగి వేమన వర్సిటీ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్.. 30 మందికి అస్వస్థత

కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయం వసతి గృహంలో ఫుడ్‌ పాయిజన్‌ అయింది.

Updated : 22 Feb 2024 15:58 IST

కడప (నేర వార్తలు): కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయం వసతి గృహంలో ఫుడ్‌ పాయిజన్‌ అయింది. దీంతో 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. బుధవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యూనివర్సిటీ అధికారులు రాత్రికి రాత్రే గుట్టుచప్పుడు కాకుండా వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కొంతమంది పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వారిని నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. బుధవారం రాత్రి విద్యార్థులు వంకాయ కూర, రసంతో అన్నం తిన్నారు. ఆ తర్వాత వారికి వాంతులు, విరేచనాలు కావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఫుడ్ పాయిజన్‌కు గల కారణాలను అధికారులు పరిశీలిస్తున్నారు. విద్యార్థి సంఘం నాయకులు ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని