SC Railway: విజయవాడ డివిజన్‌ పరిధిలో 14 రైళ్లు రద్దు

విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ నిర్వహణ కోసం 14 రైళ్లు రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే(SC Railway) తెలిపింది.

Updated : 17 May 2024 22:31 IST

విజయవాడ: విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ నిర్వహణ కోసం 14 రైళ్లు రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే(SC Railway) తెలిపింది. మే 17 నుంచి జూన్‌ 4 వరకు వివిధ రోజుల్లో కొన్ని రైళ్లు రద్దు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. రాజమహేంద్రవరం-విశాఖపట్నం, మచిలీపట్నం-విశాఖ, తిరుపతి- కాకినాడ, గుంటూరు- విశాఖపట్నం, గుంటూరు- రాయగడ, విశాఖపట్నం- మహబూబ్‌నగర్‌, గుంటూరు- విశాఖపట్నం తదితర ప్రాంతాలకు వెళ్లే 14 రైళ్లను రద్దు చేసినట్టు తెలిపారు. రద్దైన రైళ్ల వివరాలను రైల్వేశాఖ వెబ్‌సైట్‌లో పొందుపర్చినట్టు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని