Hyderabad: గణపయ్య బంగారు లడ్డూ వేలం.. ఎంత ధర పలికిందంటే?

వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా గణపయ్య బంగారు లడ్డూ వేలం విశేషంగా ఆకట్టుకుంది.

Updated : 25 Sep 2023 10:57 IST

హైదరాబాద్‌: వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా గణపయ్య బంగారు లడ్డూ వేలం విశేషంగా ఆకట్టుకుంది. నారాయణగూడ పరిధిలోని వీధి నంబర్ 5లో వినాయకుడి చేతిలో ప్రత్యేకంగా తులం బంగారంతో తయారు చేసిన లడ్డూను ఉంచారు. నిమజ్జనం రోజు 15 కిలోల లడ్డూతో కలిపి దీన్ని వేలం వేశారు. రూ.1,116తో వేలం పాట మొదలు కాగా, హిమాయత్ నగర్‌కు చెందిన సంధ్యారాణి రూ.1.36 లక్షలకు దక్కించుకున్నారు. అనంతరం గంగమ్మ ఒడికి గణపయ్య బయలుదేరి వెళ్లగా.. డీజే పాటలు, తీన్మార్ డప్పు చప్పుళ్ల మధ్య భక్తులు నృత్యాలతో సందడి చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని