గ్యాస్‌ పైపులైన్‌ లీక్‌.. భారీగా ఎగసిపడిన మంటలు

ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం పెనుమల్లిలో గ్యాస్‌ పైపులైన్‌ లీకైంది.

Updated : 15 Apr 2024 15:04 IST

ముదినేపల్లి: ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం పెనుమల్లిలో గ్యాస్‌ పైపులైన్‌ లీకైంది. ప్రధాన రహదారి వెంబడి లీకవడం.. సమీపంలో వేసిన చెత్తకు నిప్పు అంటుకోవడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. రోడ్డుకు ఇరువైపులా వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఇటీవల పెరికెగూడెం నుంచి డోకిపర్రు వరకు కేవలం రెండు అడుగుల లోతులోనే పైపు లైన్‌ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో గ్యాస్‌ లీక్‌ కావడంతో ప్రమాదం జరిగింది. కైకలూరు అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని