GATE 2023 score card: గేట్‌- 2023 స్కోరు కార్డులు విడుదల

GATE 2023 స్కోరు కార్డులను ఐఐటీ కాన్పూర్‌ విడుదల చేసింది. పరీక్ష రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి వీటిని పొందొచ్చు.

Updated : 21 Mar 2023 19:02 IST

కాన్పూర్‌: జాతీయస్థాయి పరీక్ష గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు ఇన్‌ ఇంజినీరింగ్‌(గేట్‌)-2023 రాసిన విద్యార్థుల స్కోరు కార్డులు విడుదలయ్యాయి. మార్చి 16న  ఫలితాలను ప్రకటించిన ఐఐటీ కాన్పూర్‌.. తాజాగా స్కోరు కార్డులను వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పరీక్ష రాసిన విద్యార్థులు మార్చి 21 (మంగళవారం) నుంచి మే 31వరకు gate.iitk.ac.in అధికారిక వెబ్‌సైట్‌ నుంచి ఉచితంగా స్కోరు కార్డుల్ని పొందొచ్చు. దేశంలోని ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఇతర ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఎంటెక్‌ కోర్సులో ప్రవేశానికి మొత్తం 29 సబ్జెక్టుల్లో ఈ పరీక్షను ఫిబ్రవరి 4, 5, 11, 12 తేదీల్లో ఆన్‌లైన్‌లో పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ పరీక్షకు 6.70లక్షల మంది విద్యార్థులు రిజిస్టర్‌ చేసుకోగా.. 5.17లక్షల మంది హాజరయ్యారు. లక్ష మంది ఈ పరీక్షను క్లియర్‌ చేసినట్టు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని