నా నంబరు రాసుకోండి.. లంచమడిగితే చెప్పండి

నా ఫోన్‌ నంబరు 98497 77799 రాసుకోండి... నియోజకవర్గంలో ఎక్కడ అవినీతి జరిగినా నాకు సమాచారం ఇవ్వండి... 24గంటలూ ఫోన్లో అందుబాటులో ఉంటాను..

Updated : 29 Mar 2023 05:48 IST

చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే కన్నబాబురాజు

అచ్యుతాపురం, మునగపాక, రాంబిల్లి, న్యూస్‌టుడే: ‘నా ఫోన్‌ నంబరు 98497 77799 రాసుకోండి... నియోజకవర్గంలో ఎక్కడ అవినీతి జరిగినా నాకు సమాచారం ఇవ్వండి... 24గంటలూ ఫోన్లో అందుబాటులో ఉంటాను... అవినీతి చేసిన వారి భరతం పడతాను’ అని ఎలమంచిలి ఎమ్మెల్యే యూవీ.రమణమూర్తి రాజు (కన్నబాబు) డ్వాక్రా మహిళలకు హామీ ఇచ్చారు. అచ్యుతాపురం, మునగపాక, రాంబిల్లి మండలాల్లో  డ్వాక్రా మహిళలకు ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంగళవారం ఎమ్మెల్యే పాల్గొన్నారు. అచ్యుతాపురంలో డ్వాక్రా మహిళలకు రూ.11.31కోట్ల విలువైన చెక్కులను ఆయన అందించారు. 

కార్యక్రమానికి హాజరైన డ్వాక్రా మహిళలు

మునగపాకలో రూ.10.28 కోట్లు, రాంబిల్లి మండలంలో రూ.8.72 కోట్లు ఆసరా నిధులు మంజూరయ్యాయి. ఈ మేరకు చెక్కులు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డ్వాక్రా రుణాల పంపిణీ, ఇతర కార్యక్రమాల్లో డబ్బులు అడిగితే తనకు సమాచారం అందివ్వాలన్నారు. కార్యక్రమాల్లో గవర కార్పొరేషన్‌ ఛైర్మన్‌ బొడ్డేడ ప్రసాద్‌, ఎంపీపీలు కోన సంధ్య, మళ్ల జయలక్ష్మి, జడ్పీటీసీ సభ్యులు నర్మాల కుమార్‌, పెంటకోట స్వామి సత్యనారాయణ, ధూళి నాగరాజు, డీసీసీబీ మాజీ ఛైర్మన్‌ సుకుమార్‌వర్మ, వైకాపా నాయకులు కూండ్రపు వెంకునాయుడు, పిన్నంరాజు వాసు, ఆడారి గణపతి అచ్చింనాయుడు, పి.కిషోర్‌రాజు,   ఏపీఎం చిన్నతల్లి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు