నోటా.. మాట వినలేదు..!

పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఎవరూ నచ్చకుంటే నోటా (నన్‌ ఆఫ్‌ ద అబోవ్‌)కు ఓటు వేయొచ్చు. ఈసారి ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో నోటా మాట చాలా మంది వినలేదు.

Updated : 04 Dec 2023 06:55 IST

ఈనాడు, మహబూబాబాద్‌

పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఎవరూ నచ్చకుంటే నోటా (నన్‌ ఆఫ్‌ ద అబోవ్‌)కు ఓటు వేయొచ్చు. ఈసారి ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో నోటా మాట చాలా మంది వినలేదు. 2018లో కంటే ఈసారి తక్కువ మంది దానిని ఎంచుకున్నారు.  ఇది హర్షించదగిన విషయమని భావించవచ్చు.

ఉమ్మడి జిల్లాలో 12,184 తగ్గాయి..: గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 33,358 ఓట్లు నోటాకు రాగా.. ఈసారి 21,174 మాత్రమే వచ్చాయి.
రాష్ట్రంలోనే వర్ధన్నపేట రెండో స్థానం:  ఈసారి రాష్ట్రంలోనే కుత్బుల్లాపూర్‌ నియోజకర్గంలో నోటాకు అత్యధికంగా 4,079 ఓట్లు పోలయ్యాయి. వర్ధన్నపేట 3612 ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది. 2018లో వర్ధన్నపేట 5,874 ఓట్లతో మొదటి స్థానంలో ఉండేది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని