Tirupati: ఆర్టీసీలో అత్యాధునిక మోసం

ఆర్టీసీలో అత్యాధునిక మోసం బయటపడింది. అద్దె బస్సుకు చెందిన ఓ డ్రైవర్‌ ఆర్టీసీ కంప్యూటరైజ్డ్‌ బస్సు టికెట్లను, నకిలీ టికెట్లుగా తయారీ చేసి, ప్రయాణికులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Updated : 24 Feb 2024 08:26 IST

అద్దె బస్సుల డ్రైవర్లకు టిమ్‌ల అప్పగింత
హైటెక్‌ టెక్నాలజీతో టికెట్ల మార్పిడి

తిరుపతి (ఆర్టీసీ), న్యూస్‌టుడే: ఆర్టీసీలో అత్యాధునిక మోసం బయటపడింది. అద్దె బస్సుకు చెందిన ఓ డ్రైవర్‌ ఆర్టీసీ కంప్యూటరైజ్డ్‌ బస్సు టికెట్లను, నకిలీ టికెట్లుగా తయారీ చేసి, ప్రయాణికులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుర్తించిన అధికారులు వైఎస్‌ఆర్‌ కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన డ్రైవర్‌ ఎం.సురేష్‌బాబును విచారిస్తున్నారు.

తిరుమల- తిరుపతి మధ్య 50, తిరుమల- రేణిగుంట విమానాశ్రయం మధ్య 10, తిరుపతి- మదనపల్లె 6, తిరుపతి- నెల్లూరు 8, తిరుపతి- కడప 8, తిరుపతి- శ్రీకాళహస్తి 3 మొత్తం 85 విద్యుత్తు బస్సులు నడుస్తున్నాయి. ఆదాయాన్ని ఆర్టీసీ తీసుకొని, కి.మీ. చొప్పున గుత్తేదారు సంస్థకు చెల్లిస్తోంది. డ్రైవర్లకు టిమ్‌లు అప్పగించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. సాధారణ అద్దె బస్సుల్లో ఆర్టీసీ కండక్టర్లలా వీటిల్లో ఎందుకు ఏర్పాటు చేయలేదన్న ప్రశ్నలున్నాయి. డ్రైవర్ల కొరతతో ఎవరు దొరికితే వారిని గుత్తేదారు సంస్థ నియమించుకుని, శిక్షణ ఇవ్వకుండా ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెడుతోంది. తిరుమల కనుమదారిలో, నెల్లూరు, మదనపల్లె మార్గాల్లో అతివేగంగా బస్సులు నడుపుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఆర్టీసీ ఆదాయం చూస్తుందే తప్ప, ప్రయాణికుల భద్రత చూడటం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.


తనిఖీలు నిర్వహిస్తాం

- హరిబాబు, అలిపిరి డిపో మేనేజర్‌

నకిలీ టికెట్ల ఘటనతో అప్రమత్తమై నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నాం. డ్రైవర్లకు హెచ్చరిక జారీ చేశాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని