తండ్రి చివరి కోరిక.. వాహనం అందజేత!

వీలునామాలో చాలా మంది ఆస్తులు వారసులకు ఎలా పంపిణీ చేయాలో రాసుకుంటారు. కానీ జనగామ గుండ్లగడ్డకు చెందిన మహ్మద్‌ యూసుఫ్‌ మాత్రం తాను చనిపోయాక, తన పేరిట.. ముస్లింలకు ఎంతో అవసరమున్న అంతిమ యాత్ర రథాన్ని విరాళంగా ఇవ్వాలని తన కుమారులు దబీర్‌, జఫీర్‌లను కోరారు.

Published : 29 Feb 2024 04:22 IST

జనగామ, న్యూస్‌టుడే: వీలునామాలో చాలా మంది ఆస్తులు వారసులకు ఎలా పంపిణీ చేయాలో రాసుకుంటారు. కానీ జనగామ గుండ్లగడ్డకు చెందిన మహ్మద్‌ యూసుఫ్‌ మాత్రం తాను చనిపోయాక, తన పేరిట.. ముస్లింలకు ఎంతో అవసరమున్న అంతిమ యాత్ర రథాన్ని విరాళంగా ఇవ్వాలని తన కుమారులు దబీర్‌, జఫీర్‌లను కోరారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండే యూసుఫ్‌.. మైనార్టీ సంఘాల ప్రతినిధులతో కలిసి రథం లేక ఇబ్బంది పడుతున్నామని గత, ప్రస్తుత ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు సమర్పించారు. వారు సైతం హామీ ఇచ్చినా.. మరిచారు. ఈ క్రమంలోనే యూసుఫ్‌ మంగళవారం హైదరాబాద్‌లో మృతి చెందారు. తండ్రి పోయిన బాధలో ఉన్నా, చివరి కోరిక మేరకు రూ.9 లక్షల విలువైన వాహనాన్ని కొనుగోలు చేసి, అదే వాహనంలో బుధవారం తండ్రి మృతదేహాన్ని జనగామకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. కుమారులను మైనార్టీ నాయకులు జమాల్‌షరీఫ్‌, 28వ వార్డు సభ్యుడు సమద్‌, మాజీ కౌన్సిలర్లు ఎండీ అన్వర్‌, ధర్మపురి శ్రీనివాస్‌, ఎండీ షకీల్‌, ఎండీ అక్బర్‌, మౌలానా అబ్దుల్‌ హఫీజ్‌, తదితరులు అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు