Hyderabad: ఐటీ కారిడార్‌లను కలుపుతూ ఎంఎంటీఎస్‌లు

ఎట్టకేలకు ఎంఎంటీఎస్‌ రెండో దశ పూర్తయ్యింది. నగరానికి తూర్పు, పడమరలో ఉన్న ఐటీ కారిడార్‌లను కలుపుతూ లింగంపల్లి - ఘట్‌కేసర్‌ మధ్య ఎంఎంటీఎస్‌ పరుగులు పెట్టనుంది. సికింద్రాబాద్‌ను బైపాస్‌ చేస్తూ లింగంపల్లి - సనత్‌నగర్‌ - మౌలాలి - చర్లపల్లి - ఘట్‌కేసర్‌ మార్గంలో ఈ రైళ్లు సాగనున్నాయి.

Updated : 01 Mar 2024 07:24 IST

లింగంపల్లి - ఘట్‌కేసర్‌ మధ్య రెండోదశ పరుగులు
మార్చి మొదటి వారంలో ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం

ఈనాడు - హైదరాబాద్‌: ఎట్టకేలకు ఎంఎంటీఎస్‌ రెండో దశ పూర్తయ్యింది. నగరానికి తూర్పు, పడమరలో ఉన్న ఐటీ కారిడార్‌లను కలుపుతూ లింగంపల్లి - ఘట్‌కేసర్‌ మధ్య ఎంఎంటీఎస్‌ పరుగులు పెట్టనుంది. సికింద్రాబాద్‌ను బైపాస్‌ చేస్తూ లింగంపల్లి - సనత్‌నగర్‌ - మౌలాలి - చర్లపల్లి - ఘట్‌కేసర్‌ మార్గంలో ఈ రైళ్లు సాగనున్నాయి. మార్చి నాలుగైదు తేదీల్లో ఏదో ఒకరోజు ప్రధాని మోదీ దీన్ని ప్రారంభించనున్నారు. కాలుష్యం లేని, వేగవంతమైన ప్రజారవాణా నగర ప్రజలకు కేవలం రూ. 5ల టిక్కెట్‌ ధరతో దక్కనుంది.

నిధులందక జాప్యం..

ఎంఎంటీఎస్‌ మొదటి దశ 2003లో అందుబాటులోకి రాగా.. రెండో దశ 2014లో ప్రారంభమై.. 2019 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంతో పనులు చేపట్టింది ద.మ. రైల్వే. పనులు జాప్యం అవ్వడంతో రూ.817 కోట్ల అంచనాలతో చేపట్టిన ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1165 కోట్లకు పెరిగింది. నిధుల కొరత, రక్షణ శాఖ అనుమతుల్లో జాప్యం కారణంగా ఆలస్యమైంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు అందకపోయినా ద.మ. రైల్వే.. జనవరి నాటికి పనులు, తరువాత ట్రాక్‌ టెస్టు పూర్తి చేసింది. దీంతో నగరం నలుమూలల 101 కిమీ.మేర రెండో దశ పూర్తయింది.

ప్రధాని ప్రారంభించినా...

ప్రధాని మోదీ చేతులమీదుగా ప్రారంభమైనా ఎంఎంటీఎస్‌ సేవలు ఆశించినమేర అందుబాటులోకి రావడంలేదు. గత ఏప్రిల్‌లో సికింద్రాబాద్‌- మేడ్చెల్‌, ఫలక్‌నుమా -ఉందానగర్‌, రామచంద్రాపురం- తెల్లాపూర్‌ మార్గాలలో పనులు ప్రారంభించారు. ప్రయాణికులు లేరని రాత్రి పూట హాల్టింగ్‌కే తెల్లాపూర్‌ స్టేషన్‌ పరిమితంకాగా మేడ్చెల్‌ - సికింద్రాబాద్‌ మధ్య 13 సర్వీసులనే అందుబాటులోకి తెచ్చారు. ఇదే పరిస్థితి ఫలక్‌నుమా-ఉందానగర్‌ మధ్య ఉంది. మొదటి దశ 121 సర్వీసులు, 1.20 లక్షల ప్రయాణికులతో నడిచేది. తరచూ రద్దు చేస్తుండటంతో చాలామంది ఆసక్తి చూపడం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు