అమెరికా అబ్బాయి.. చిత్తూరు అమ్మాయి

అమెరికా అబ్బాయి.. చిత్తూరు అమ్మాయి హైందవ సంప్రదాయం ప్రకారం ఏకమయ్యారు. వీరి వివాహం శనివారం పలమనేరులో ఓ ప్రైవేట్‌ కల్యాణ మండపంలో ఇరువర్గాల పెద్దల అంగీకారంతో జరిగింది.

Updated : 03 Mar 2024 04:51 IST

హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం 

నూతన దంపతులు

పలమనేరు, న్యూస్‌టుడే: అమెరికా అబ్బాయి.. చిత్తూరు అమ్మాయి హైందవ సంప్రదాయం ప్రకారం ఏకమయ్యారు. వీరి వివాహం శనివారం పలమనేరులో ఓ ప్రైవేట్‌ కల్యాణ మండపంలో ఇరువర్గాల పెద్దల అంగీకారంతో జరిగింది. వివరాలిలా.. గంగవరం మండలం సాయిగార్డెన్‌సిటీలో నివసిస్తున్న పెద్దపంజాణి మండల పరిషత్తు ఏవో రేవూరి భాస్కర్‌, ఉపాధ్యాయిని సుమలతరెడ్డి దంపతుల కుమార్తె మీనా ఇంజినీరింగ్‌ చేసి అమెరికాలో సాఫ్ట్‌వేర్‌గా స్థిరపడ్డారు. ఆమె పనిచేసే సంస్థలో ఆ దేశానికి చెందిన ఏప్రెల్‌ టెర్రీ, డేల్‌ టెర్రీ దంపతుల కుమారుడు బ్రాడ్‌లీ టెర్రీతో పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు వివాహం చేసుకోవాలని భావించి ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించడంతో శుక్రవారం వారి వివాహం పలమనేరులో జరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని