ప్రయాణికులకు అవే తిప్పలు

ఆర్టీసీ ప్రయాణికుల ఇక్కట్లు ఇప్పట్లో తీరేలా లేవు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం వైఎస్‌ జగన్‌ గుడివాడలో నిర్వహించిన సభకు బాపట్ల డిపో నుంచి 26 బస్సులు కేటాయించారు.

Updated : 16 Apr 2024 06:09 IST

సీఎం జగన్‌ గుడివాడ సభకు ఆర్టీసీ బస్సులు

గుంటూరు బస్సు ఎక్కేందుకు ప్రయాణికుల పాట్లు

బాపట్ల, న్యూస్‌టుడే: ఆర్టీసీ ప్రయాణికుల ఇక్కట్లు ఇప్పట్లో తీరేలా లేవు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం వైఎస్‌ జగన్‌ గుడివాడలో నిర్వహించిన సభకు బాపట్ల డిపో నుంచి 26 బస్సులు కేటాయించారు. డిపోలో మొత్తం 43 బస్సులు ఉండగా అందులో 60 శాతానికి పైగా సీఎం సభకే వెళ్లిపోవటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. పాతబస్టాండ్‌ వద్ద ఎండలో 45 నిమిషాల నుంచి గంట వరకు గుంటూరు, విజయవాడ, తెనాలి, రేపల్లె వెళ్లే ప్రయాణికులు ఎదురుచూడాల్సి వచ్చింది. గంట తర్వాత ఒకే బస్సు రావటంతో ప్రయాణికులు తోసుకుంటూ ఎక్కారు. వృద్ధులు, మహిళలు పడరాని పాట్లు పడ్డారు. బస్సు లోపల నిల్చోవటానికి ఖాళీ లేక బాగా రద్దీగా ఉండి ఉక్కపోతతో తడిసిపోయారు. 40 డిగ్రీలకు పైగా వేడి వాతావరణంలో ఎండలో నిలబడాల్సి రావటంతో చెమటలు కక్కారు. ఎన్నికలు ముగిసే వరకు తమకు  ఈ తిప్పలు తప్పవా అని సామాన్య ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. సీఎం సభలకు శ్రీకాకుళానికి కూడా బస్సులు పంపిస్తారా, ప్రయాణికుల ఇక్కట్లను పట్టించుకోరా అని ఆర్టీసీ  అధికారులను నిలదీస్తున్నారు.

పాత బస్టాండ్‌ వద్ద బస్సుల కోసం ఎదురుచూపులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని