ఎగిసిన మంటలు

రహదారి సరిహద్దులోని గ్యాస్‌ పైపులైను ప్రమాదవశాత్తు లీకవడంతో ఒక్కసారిగా మంటలు ఎగసి పడిన ఘటన ముదినేపల్లి మండలం గురజ-పెనుమల్లి సరిహద్దులో సోమవారం జరిగింది.

Updated : 16 Apr 2024 06:12 IST

పైపులైను లీకేజీతో ఘటన
స్థానికులు ఉరుకులుపరుగులు

ముదినేపల్లి, న్యూస్‌టుడే: రహదారి సరిహద్దులోని గ్యాస్‌ పైపులైను ప్రమాదవశాత్తు లీకవడంతో ఒక్కసారిగా మంటలు ఎగసి పడిన ఘటన ముదినేపల్లి మండలం గురజ-పెనుమల్లి సరిహద్దులో సోమవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గురజ శివారులోని చెత్త కుప్పకు ఉదయం నిప్పు పెట్టారు. ఆ మంటలు   పెరికేగూడెం నుంచి డోకిపర్రు వెళ్తున్న ఒక సంస్థకు చెందిన గ్యాస్‌ పైపులైనుకు అంటుకున్నాయి. దీంతో పైపునకు చిల్లు పడటంతో ఒక్కసారిగా ఎగసి పడ్డాయి. పక్కనే ఉన్న తాటి, కొబ్బరి చెట్లకు వ్యాపించాయి. ఎస్సై వెంకటకుమార్‌ సిబ్బందితో వచ్చి రహదారిపై రాకపోకలు నిలుపుదల చేశారు. బంటుమిల్లి అగ్నిమాపకశాఖ అధికారి జి.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మంటలను అదుపు చేశారు. తహసీల్దారు కుమారి సిబ్బందితో మాట్లాడి మరమ్మతులు చేయించారు. గ్యాస్‌ పైపులైను బయట ఏర్పాటు చేయడంతోనే ప్రమాదం సంభవించిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లలేదని, అదే నివాసాల మధ్య అయితే పెనుప్రమాదం సంభవించేదని భయాందోళన వ్యక్తం చేశారు.

మంటలు అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది

కలెక్టర్‌ ఆరా.. గ్యాస్‌ పైపులైను లీకైన ఘటనపై కలెక్టర్‌ ప్రసన్న  వెంకటేశ్‌ ఆరా తీశారు. ఆర్డీవో ఖాజావలి, తహసీల్దార్‌ ఎస్‌ఎల్‌ఎన్‌.కుమారిలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పైపులైను లీకవడం, సమీపంలో చెత్తకు నిప్పంటుకోవడంతోనే ఈ ఘటన జరిగిందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని