ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం

ఓరుగల్లు నగరంలో ఓటింగ్‌ శాతం పెంచేందుకు వరంగల్‌ కలెక్టరేట్‌ ఆవరణలో సెల్ఫీ పాయింట్‌ ఏర్పాటు చేశారు.

Updated : 20 Apr 2024 06:25 IST

ఓరుగల్లు నగరంలో ఓటింగ్‌ శాతం పెంచేందుకు వరంగల్‌ కలెక్టరేట్‌ ఆవరణలో సెల్ఫీ పాయింట్‌ ఏర్పాటు చేశారు. వరంగల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి ప్రావీణ్య శుక్రవారం జిల్లా నోడల్‌ అధికారులతో కలిసి సెల్ఫీ పాయింట్‌ వద్ద ఫొటోలు దిగారు. వరంగల్‌ రైల్వేస్టేషన్‌, బస్టాండుల్లో, హనుమకొండ పబ్లిక్‌ గార్డెన్‌ వద్ద సెల్ఫీ పాయింట్లను ఏర్పాటు చేశామన్నారు. గత ఎన్నికల్లో నగరంలో ఓటింగ్‌శాతం తక్కువగా నమోదైందని, ఈసారి పెంచేందుకు కళాజాత, 5కె రన్‌, ముగ్గుల పోటీలు, ఫ్లాష్‌మాబ్‌ వంటి వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.

న్యూస్‌టుడే, వరంగల్‌ కలెక్టరేట్‌, కార్పొరేషన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని