విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు

వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్‌ సీనియర్‌ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు.

Published : 20 Apr 2024 07:01 IST

రైల్వేస్టేషన్‌, న్యూస్‌టుడే: వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్‌ సీనియర్‌ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. విశాఖ-ఎస్‌ఎంవీ బెంగళూరు(08549) ప్రత్యేక రైలు ఈ నెల 27 నుంచి జూన్‌ 29 వరకు ప్రతి శనివారం మధ్యాహ్నం 1.15 గంటలకు విశాఖలో బయలు దేరి మర్నాడు ఉదయం 7.30 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. ఎస్‌ఎంవీ బెంగళూరు-విశాఖ(08550) ప్రత్యేక రైలు ఈ నెల 28 నుంచి జూన్‌ 30 వరకు ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు బెంగళూరులో బయలుదేరి మర్నాడు ఉదయం 9 గంటలకు విశాఖ వస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని