నాడు ‘అన్న’దానం... నేడు అధ్వానం

తెదేపా హయాంలో నగరాలు, పట్టణాల్లో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు.

Updated : 22 Apr 2024 06:24 IST

నాడు అన్నక్యాంటీన్‌ ప్రారంభించి భోజనం చేస్తున్న అప్పటి సీఎం చంద్రబాబు

తెదేపా హయాంలో నగరాలు, పట్టణాల్లో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. పనుల నిమిత్తం వివిధ ప్రాంతాల నుంచి వచ్చే సామాన్యులు, పేద విద్యార్థులు, నిరు పేదలు రోజూ రూ.5కే అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం చేసేవారు. అందరూ కడుపు నిండా భోజనం చేసి సంతృప్తిగా వెళ్లేవారు. ఆ సొమ్ము చెల్లించలేని వారికి ఉచితంగానే ఆకలి తీర్చేవారు. అన్న క్యాంటీన్లకు వస్తున్న ఆదరణ చూసి కడుపు మండి వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని మూత వేయించింది. పేదల కడుపు కొట్టేసింది. మానవత్వం లేని సీఎం జగన్‌... పేదలకు ఆహారం లేకుండా చేసి ఆ పాపం మూటకట్టుకున్నారు.

ఇప్పుడిలా..

350 మంది కడుపు నింపేది..  తాడేపల్లి మండలం ఉండవల్లిలో 2018 జులై 12న అన్నక్యాంటీన్‌ని ప్రారంభించిన అప్పటి సీఎం చంద్రబాబు ప్రజలతో కలసి భోజనం చేశారు. రోజూ 350 మందికిపైగా పేదవారు ఇక్కడ కడుపు నింపుకొనేవారు. అయిదేళ్ల కిందట అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి జగన్‌ వీటిని మూసివేసి ఎంతో మంది కడుపుకొట్టారు. దీనితో ప్రస్తుతం ఉండవల్లిలోని అన్నక్యాంటీన్‌ దుస్థితి ఇదీ.

న్యూస్‌టుడే, తాడేపల్లి


కళాహీనం..  ఇది తెనాలి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌ వెనుక ఉన్న అన్న క్యాంటీన్‌. 2018లో అప్పటి ప్రభుత్వ రూ.35 లక్షలు, మున్సిపల్‌ సాధారణ నిధులు రూ.5 లక్షల వంతున ఖర్చు చేసి కార్పొరేట్‌ భవంతిలా తీర్చిదిద్దింది. రోజుకు 500 మందికి తగ్గకుండా పేదలు వినియోగించుకున్నారు. నేడు అపరిశుభ్రంగా విరిగిన గేటు, కిటికీలతో కళాహీనంగా దర్శనమిస్తోంది.

న్యూస్‌టుడే, తెనాలి పట్టణం


ఎయిడ్స్‌ పరీక్ష సలహా కేంద్రంగా మార్చేసి.. గుంటూరు- అమరావతి ప్రధాన రహదారిలో జ్వరాల ఆస్పత్రి వద్ద నాడు వేల మంది అన్నార్తులకు ఆకలి తీర్చిన అన్నక్యాంటీన్‌ ఇది. నేడిలా ఎయిడ్స్‌ పరీక్ష సలహా కేంద్రంగా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని