భగభగ మండే

విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది.

Updated : 23 Apr 2024 05:58 IST

మిర్యాలగూడలోని ఓ సోడా బండి వద్ద జనం రద్దీ

మిర్యాలగూడ పట్టణం, న్యూస్‌టుడే: విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. ఈ ఏడాది ఈ ప్రాంతంలో ఇదే రికార్డు స్థాయి ఉష్ణోగ్రత. ఉదయం 10 గంటల నుంచే ఎండ, వడగాలులు వీస్తుండడంతో ప్రజలు అల్లాడిపోయారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సైతం ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి. రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఉమ్మడి జిల్లాలో నమోదవుతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన మొదటి ఐదు ప్రాంతాలు ఉమ్మడి జిల్లా నుంచే ఉండడం ఆందోళన కలిగించే అంశం. మాడ్గులపల్లి, వేములపల్లి, మోతె మండలాల్లో రాష్ట్రంలోనే రెండో అత్యధిక ఉష్ణోగ్రతలు 44.9 డిగ్రీలు నమోదయ్యాయి. త్రిపురారం మండలంలో 44.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదివారం సాయంత్ర పలు చోట్ల వర్షాలు పడి చల్లబడిందనుకున్న వాతావరణం ఒక్కసారిగా వేడెక్కడంతో ప్రజలు అల్లాడిపోయారు. యాదాద్రి జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత బొమ్మలరామారం మండలం మర్యాలలో 43.3 డిగ్రీలుగా నమోదైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని