10 నిమిషాలకో బస్సు.. మెట్రోలేని మార్గాల్లో నడిపేందుకు యోచన

ప్రయాణికుల రద్దీని బట్టి ప్రతి 3, 6, 8 నిమిషాలకు మెట్రో పరుగులు పెడుతోంది. కళ్ల ముందే మెట్రో వెళ్లిపోయినా మరొకటి వస్తుందని ప్రయాణికులకు ఒక నమ్మకం. ఇప్పుడు అదే నమ్మకాన్ని టీఎస్‌ఆర్టీసీ కల్పించేందుకు కృషి చేస్తోంది.

Updated : 18 May 2024 06:44 IST

ఈనాడు - హైదరాబాద్‌: ప్రయాణికుల రద్దీని బట్టి ప్రతి 3, 6, 8 నిమిషాలకు మెట్రో పరుగులు పెడుతోంది. కళ్ల ముందే మెట్రో వెళ్లిపోయినా మరొకటి వస్తుందని ప్రయాణికులకు ఒక నమ్మకం. ఇప్పుడు అదే నమ్మకాన్ని టీఎస్‌ఆర్టీసీ కల్పించేందుకు కృషి చేస్తోంది. మెట్రో లేని మార్గాల్లో సమయాలను నిర్దేశించి వాటి ప్రకారం బస్సులు నడపాలని నిర్ణయించింది. ప్రయోగాత్మకంగా సికింద్రాబాద్‌- మణికొండ మార్గాన్ని ఎంచుకుని 47ఎల్‌ పేరుతో సిటీ బస్సులు నడుపుతోంది. 222 ఎల్‌(లింగంపల్లి - కోఠి) బస్సులకు సైతం సమయాలను నిర్దేశించారు. ఈ రెండు రూట్లలో ప్రయాణికుల ఆదరణను దృష్టిలో పెట్టుకుని 10 నిమిషాలకో బస్సు నడపాలని నిర్ణయించినట్టు గ్రేటర్‌జోన్‌ అధికారులు పేర్కొన్నారు.

ప్రయోగాత్మకంగా 47ఎల్‌ బస్సు.. సికింద్రాబాద్‌- మణికొండ మధ్య నడిచే 47ఎల్‌ బస్సు తెల్లవారుజాము 4 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి మొదటి సర్వీసు బయలుదేరుతుంది. మణికొండ నుంచి ఇదే బస్సు ఉదయం 5.15కు బయలుదేరుతుంది. ఇలా రాత్రి 10 గంటలకు చివరి బస్సు సికింద్రాబాద్‌- మణికొండకు రాత్రి 11.15కు చేరుకుని తిరిగి సికింద్రాబాద్‌కు పయనమవుతోంది. కోఠి- లింగంపల్లి మధ్య కూడా 222 ఎల్‌ రూటు బస్సులు వేకువజాము నుంచి రాత్రి 11 గంటల వరకూ ప్రతి 20 నిమిషాలకో బస్సు ఉండేలా చర్యలు తీసుకుటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని