రాములోరికి పసిడి పుష్పార్చన

భద్రాచలం రామాలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. కోవెల పరిసరాలు కిక్కిరిసిపోయాయి. మూలవిరాట్‌కు అర్చకులు సుప్రభాతం పలికి ఆరాధించారు.

Updated : 20 May 2024 06:20 IST

భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాచలం రామాలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. కోవెల పరిసరాలు కిక్కిరిసిపోయాయి. మూలవిరాట్‌కు అర్చకులు సుప్రభాతం పలికి ఆరాధించారు. అభిషేక మహోత్సవం కనుల పండువగా సాగింది. పసిడి పుష్పాలతో నిర్వహించిన అర్చన అలరించింది. విష్వక్సేనుల వారిని ఆరాధించి పుణ్యాహవాచనం నిర్వహించారు. గోత్రనామాలను పఠించారు. కల్యాణ క్రతువును వివరిస్తూ సీతమ్మకు యోక్త్రధారణ,  రామయ్యకు యజ్ఞోపవీతధారణ చేయించారు. మాంగల్యధారణ, తలంబ్రాల వేడుక భక్రిశ్రద్ధలతో సాగాయి. సర్వ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీసత్యనారాయణస్వామి వారి వార్షిక తిరు కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించి ప్రసాదాన్ని పంచారు. సోమవారం చిత్తా నక్షత్రం సందర్భంగా యాగశాలలో సుదర్శన హోమం నిర్వహించనున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని