ఇసుకాసురుల అరాచకం!

ఒంటిమిట్ట మండలం దర్జిపల్లి శివారు పెన్నానదిలో ఎలాంటి అనుమతుల్లేకుండా వైకాపా నేతలు ఇసుక తవ్వేస్తున్నా అధికారులు పట్టించుకోలేదు. స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఎట్టకేలకు గత నెలలో తవ్వకాలు నిలిపివేసినా అప్పటికే నదిలో కొన్నిచోట్ల గట్టిమట్టి తేలింది.

Updated : 22 May 2024 05:27 IST

దర్జిపల్లి శివారు పెన్నా నదిలో ఇసుక రవాణాకు అక్రమంగా నిర్మించిన రహదారి

ఒంటిమిట్ట మండలం దర్జిపల్లి శివారు పెన్నానదిలో ఎలాంటి అనుమతుల్లేకుండా వైకాపా నేతలు ఇసుక తవ్వేస్తున్నా అధికారులు పట్టించుకోలేదు. స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఎట్టకేలకు గత నెలలో తవ్వకాలు నిలిపివేసినా అప్పటికే నదిలో కొన్నిచోట్ల గట్టిమట్టి తేలింది. ఇసుక అక్రమ రవాణా జరిగిన ప్రాంతాన్ని పరిశీలించగా నలుదిశలా వాహనాల రాకపోకలకు అనువుగా రాళ్లు, మొరం, మట్టి తీసుకొచ్చి దారులు ఏర్పాటు వేసి ఉన్నాయి. దాదాపు 8 నుంచి 10 అడుగుల లోతు మేర తవ్వకాలు చేయడంతో పెద్ద పెద్ద గుంతలేర్పడ్డాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో అధికారుల బృందం ఆదివారం అధికార అనుమతి పొందిన రేవులను మాత్రమే పరిశీలించింది. ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో ఇసుక అక్రమ రవాణా దందా సాగించిన ఈ ప్రాంతం వైపు కనీసం చూడకపోవడం గమనార్హం.

భారీగా ఇసుక తవ్వకాలతో గోతులమయంగా పెన్నానది

ఈనాడు కడప, న్యూస్‌టుడే, ఒంటిమిట్ట 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని