Flood: చింతూరును ముంచెత్తిన వరద.. మూడు రాష్ట్రాలకు నిలిచిన రాకపోకలు

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ప్రాంతాన్ని గోదావరి, శబరి నదులు ముంచెత్తాయి. వరదలతో చింతూరు, వరరామచంద్రాపురం, కూనవరం మండలాల్లో సుమారు 115 గ్రామాలు ముంపునకు గురయ్యాయి.

Updated : 30 Jul 2023 14:23 IST

చింతూరు: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ప్రాంతాన్ని గోదావరి, శబరి నదులు ముంచెత్తాయి. వరదలతో చింతూరు, వరరామచంద్రాపురం, కూనవరం మండలాల్లో సుమారు 115 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. భారీ వరదల కారణంగా గత ఐదు రోజులుగా ఏపీ, తెలంగాణ నుంచి ఛత్తీస్‌గఢ్‌కు జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. 

చట్టి, సింగన్నగూడెం గ్రామాల మధ్య ప్రధాన రహదారి.. చింతూరు నుంచి ఒడిశా వైపు వెళ్లే హైవేపై నిమ్మలగూడెం, కుయ్యుగూరు మధ్య వరద చేరడంతో రాకపోకలు స్తంభించాయి. కూనవరం, వరరామచంద్రాపురం మండలాల మధ్య శబరి నదిపై ఉన్న వంతెన పూర్తిగా మునిగిపోయింది. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లోకి సుమారు 20 వేల మంది వరద బాధితులు చేరుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని