Kakinada: ఎన్నికల వేళ తనిఖీలు.. రూ.3కోట్ల విలువైన బంగారం సీజ్‌

అనుమతి లేకుండా తరలిస్తున్న రూ.3కోట్ల విలువైన బంగారాన్ని ఫ్లయింగ్‌ స్వ్కాడ్‌ అధికారులు సీజ్‌ చేశారు.

Published : 13 Apr 2024 21:59 IST

కాకినాడ: అనుమతి లేకుండా తరలిస్తున్న రూ.3కోట్ల విలువైన బంగారాన్ని ఫ్లయింగ్‌ స్వ్కాడ్‌ అధికారులు సీజ్‌ చేశారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు టోల్‌గేట్‌ వద్ద తనిఖీలు నిర్వహించిన అధికారులు సీక్వెల్‌ లాజిస్టిక్‌ వాహనంలో విశాఖ నుంచి కాకినాడ తరలిస్తున్న  బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని తహసీల్దార్‌ కార్యాలయానికి తరలించారు. వీటికి సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో జీఎస్‌టీ, ఐటీశాఖ అధికారులకు సమాచారమిచ్చినట్టు  ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ తెలిపింది. బంగారు ఆభరణాలు కాకినాడకు చెందిన నాలుగు జ్యూయెలరీ షాపులకు సంబంధించినవని లాజిస్టిక్స్‌ సిబ్బంది చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని