Khammam: కాజీపేట - విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలు పునరుద్ధరణ

ఖమ్మం జిల్లా చింతకాని మండల పరిధిలోని పాతర్లపాడు వద్ద గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. ఖమ్మం నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Updated : 17 Feb 2024 14:23 IST

చింతకాని: ఖమ్మం - విజయవాడ మార్గంలో చింతకాని మండలం పాతర్లపాడు వద్ద శనివారం ఉదయం బొగ్గు లోడుతో వెళ్తోన్న గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. 113వ గేటు సమీపంలోకి రైలు రాగానే భారీ శబ్దాలు వచ్చాయి. దీంతో లోకోపైలట్‌ రైలును నిలిపివేశాడు. రెండు బోగీలు పూర్తిగా రైల్వే ట్రాక్‌ నుంచి పక్కకు జరిగాయి. సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకుందని రైల్వే సిబ్బంది వెల్లడించారు. దీంతో కాజీపేట నుంచి విజయవాడ వెళ్తున్న పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నిలిపివేశారు. 

నాలుగున్నర గంటలపాటు సాగిన మరమ్మతులు

విజయవాడ, కాజీజీపేట నుంచి వచ్చిన రైల్వే సాంకేతిక సిబ్బంది నాలుగున్నర గంటలపాటు శ్రమించి పట్టాలు తప్పిన బోగీని పక్కకు తొలగించారు. మధ్యాహ్నం ఒకటిన్నరకు మరమ్మతులు పూర్తి కావడంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. మొదటగా తిరుపతి కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ రైలు వెళ్లింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని