SC Railway: పట్టాలు తప్పిన గూడ్స్‌.. గుంటూరు-సికింద్రాబాద్‌ మార్గంలో రైళ్లకు అంతరాయం

గుంటూరు-సికింద్రాబాద్‌ మార్గంలో నల్గొండ జిల్లా దామచర్ల మండలం విష్ణుపురం రైల్వేస్టేషన్ వద్ద గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. 

Updated : 26 May 2024 19:02 IST

దామచర్ల: గుంటూరు-సికింద్రాబాద్‌ మార్గంలో నల్గొండ జిల్లా దామచర్ల మండలం విష్ణుపురం రైల్వేస్టేషన్ వద్ద ఆదివారం మధ్యాహ్నం గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. గుంటూరు నుంచి సికింద్రాబాద్‌ వైపు వెళ్తోన్న గూడ్స్‌ రైలు పక్కకు ఒరిగిపోవడంతో రెండు బోగీలు పట్టాలు తప్పాయి. ఆ సమయంలో రైలు తక్కువ స్పీడ్‌లో ఉండటంతో డ్రైవర్‌ చాకచక్యంగా బ్రేక్‌లు వేసి మిగతా బోగీలు పడిపోకుండా జగ్రత్తపడ్డారు. దీంతో గుంటూరు - సికింద్రాబాద్ మార్గంలో పలు రైళ్లు ఆలస్యంగా తిరుగుతున్నాయి. శబరి ఎక్స్‌ప్రెస్‌ను మిర్యాలగూడలోనే నిలిపివేశారు. జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ను పిడుగురాళ్లలో నిలిపివేసినట్టు రైల్వే అధికారులు తెలిపారు. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు